ఈ శుక్రవారం కూడా (2025 నవంబర్ 21న) ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్ లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇందులో ఫ్యామిలీ, హారర్, కామెడీ, యాక్షన్ వంటి జోనర్స్లో 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్కి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా మనోజ్ బాజ్‌పాయ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ 'బైసన్', ది బెంగాల్ ఫైల్స్, జాన్వీ కపూర్ ఆస్కార్ ఎంట్రీ ఫిల్మ్ 'హోమ్ బౌండ్' వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలన్నీ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5, ఈటీవీ విన్, ఆపిల్ ప్లస్ టీవీ, సోనీ లివ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లలో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటీ? ఏ సినిమా ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? అనేది ఓ లుక్కేద్దాం..
నెట్‌ఫ్లిక్స్:
బైసన్ (తెలుగు, తమిళ విలేజ్ స్పోర్ట్స్ పొలిటికల్ యాక్షన్)- నవంబర్ 21
డైనింగ్ విత్ ది కపూర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 21
హౌమ్‌బౌండ్ (హిందీ విలేజ్ డ్రామా)- నవంబర్ 21
ALSO READ : వద్దనుకున్న బంగారమే పేరు తెచ్చిపెట్టింది..
ట్రైన్ డ్రీమ్స్ (హాలీవుడ్ హిస్టారికల్ ఫిక్షన్)- నవంబర్ 21
వన్ షాట్ విత్ ఎడ్ షీరన్ (హాలీవుడ్ మ్యూజికల్ డ్రామా సిరీస్)- నవంబర్ 21
సంగ్రే డెల్ టోరో (మెక్సికన్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- నవంబర్ 21
అమెజాన్ ప్రైమ్:
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్)- నవంబర్ 21
యానివర్సరీ (అమెరికన్ డిస్టోపియన్ పొలిటికల్ థ్రిల్లర్)- నవంబర్ 21
జియో హాట్‌స్టార్:
జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
రాంబో ఇన్ లవ్ (న్యూ ఎపిసోడ్స్) (తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్)- నవంబర్ 21
ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
17 ది రోజెస్ (హాలీవుడ్ మూవీ)- నవంబర్ 20
జీ5:
ది బెంగాల్ ఫైల్స్ (హిందీ హిస్టారికల్ పొలిటికల్ థ్రిల్లర్)- నవంబర్ 21
ఒండు సరళ ప్రేమ కథే (కన్నడ రొమాంటిక్ కామెడీ)- నవంబర్ 21
ఆహా ఓటీటీ:
చెఫ్ మంత్ర సీజన్ 5 (తెలుగు కామెడీ ఫుడ్ రియాలిటీ షో)- నవంబర్ 20
ఒండు సరళ ప్రేమ కథే (కన్నడ రొమాంటిక్ కామెడీ)- నవంబర్ 21
డీసిల్ (తమిళ యాక్షన్ థ్రిల్లర్)- నవంబర్ 21
చౌపల్ ఓటీటీ:
మెయిన్ తేరే కుర్బాన్ (పంజాబీ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా)-నవంబర్ 20
లయన్స్ గేట్ ప్లే:
రీలే (తెలుగు డబ్బింగ్ అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ )- నవంబర్ 21
సన్ నెక్ట్స్ ఓటీటీ:
కర్మణ్యే వాధికారస్తే (తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్)- నవంబర్ 21
ఉసిరు (కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్)- నవంబర్ 21
మనోరమ మ్యాక్స్ ఓటీటీ:
షేడ్స్ ఆఫ్ లైఫ్ (మలయాళ రొమాంటిక్ డ్రామా)- నవవంబర్ 21
పీకాక్ ఓటీటీ:
ది బ్యాడ్ గాయ్స్ 2 (అమెరికన్ యానిమేటెడ్ హీస్ట్ యాక్షన్ ఫిల్మ్)- నవంబర్ 21
యాపిల్ టీవీ ప్లస్:
ది ఫ్యామిలీ ప్లాన్ 2 (ఇంగ్లీష్ యాక్షన్ ఫ్యామిలీ )- నవంబర్ 21
షడ్డర్ ఓటీటీ:
గుడ్ బాయ్ (అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ )- నవంబర్ 21
ఈ 4 వెరీ స్పెషల్..
1. ‘ది ఫ్యామిలీ మేన్’:
ఇండియన్ వెబ్ సిరీసుల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిల్లో ‘ది ఫ్యామిలీ మేన్’ (The Family Man) సిరీస్ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్స్ రాగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ శుక్రవారం థర్డ్ సిరీస్.. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. పాన్ ఇండియా భాషలతో పాటుగా వరల్డ్ వైడ్గా స్ట్రీమింగ్కి అందుబాటులోకి వచ్చింది.
మనోజ్ బాజ్‌పాయ్ లీడ్ రోల్‌లో రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో గూఢచారి పోలీస్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీగా మనోజ్ కనిపించనున్నాడు. ఓ వైపు దేశాన్ని కాపాడే స్పై ఏజెంట్‌గా, మరోవైపు మిడిల్ క్లాస్ మ్యాన్‌గా గత రెండు సీజన్స్‌లోనూ మనోజ్ నటన ఎంతో ఆకట్టుకుంది. ఇక అతనికి భార్యగా ప్రియమణి నటించింది. రెండో సీజన్‌లో సమంత కీ రోల్ చేసింది. ఇక పార్ట్ 3లో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, ఆశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
2. బైసన్:
ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘బైసన్’. దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ రూపొందించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 1990 పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో కబడ్డీ ఆట కథాంశంతో వచ్చిన ఈ మూవీ రా అండ్ రస్టిక్‌గా ఇంటరెస్టింగ్‌గా ఉండనుంది. నెట్‌ఫ్లిక్స్ లో అందుబాలోకి ఉంది.
3.‘హోమ్‌బౌండ్’:
98వ అకాడమీ అవార్డ్స్ కోసం భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైన బాలీవుడ్ మూవీ ‘హోమ్‌బౌండ్’ (Homebound). బాలీవుడ్ నటులు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించాడు. అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోస్ట్రీమింగ్ అవుతుంది.
4. ది బెంగాల్ ఫైల్స్:
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది బెంగాల్ ఫైల్స్.. ఇవాళ నవంబర్ 21, 2025న ZEE5లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి మరియు దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
