OTT Movies: రాఖీ పండుగ స్పెషల్: థియేటర్/ ఓటీటీ సినిమాలివే.. తెలుగులో 8 మాత్రమే ఇంట్రెస్టింగ్

OTT Movies: రాఖీ పండుగ స్పెషల్: థియేటర్/ ఓటీటీ సినిమాలివే.. తెలుగులో 8 మాత్రమే ఇంట్రెస్టింగ్

థియేటర్/ ఓటీటీ సినిమాల కోసం ఆడియన్స్ ఎప్పుడు ఎదురుచూస్తూనే ఉంటారు. కొన్నిసార్లు థియేటర్లో ఎలాంటి సినిమాలు లేనప్పుడు, ఓటీటీలో వచ్చేవే కీలకంగా మారనున్నాయి. మరి ఈ వారం వచ్చేది అసలే రాఖీ పండుగ. ఇలాంటి సమయంలోనే ప్రేక్షకులు మరింతగా ఎదురుచూస్తారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఎలాంటి సినిమా అందుబాటులో ఉందంటూ ఆలోచిస్తారు.

ఇంకో విషయం చెప్పాలంటే.. తెలుగు ప్రేక్షుకులు పండుగ వచ్చిందంటే థియేటర్ల వైపే చూడటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి 2025 రాఖీ స్పెషల్గా ప్రేక్షకులను అలరించడానికి పెద్ద హీరోల సినిమాలు మాత్రం అందుబాటులో లేకపోవడం కాస్తా నిరాశ కలిగే అంశం. అయినప్పటికీ.. ఎలాంటి మాస్ యాక్షన్ లేకుండా సరదాగా నవ్వుకునే చిన్న సినిమాలు మాత్రం రెడీగా ఉన్నాయి.

అందులో 'బకాసుర రెస్టారెంట్', 'రాజుగాని సవాల్', 'అతడు' రీ రిలీజ్ అవుతుండగా కన్నడ బ్లాక్‌బస్టర్ 'సూ ఫ్రమ్ సూ' కూడా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మరీ సినిమాల కథలు ఎలా ఉన్నాయి? హీరోలు ఎవరనేది చూసేద్దాం.. 

తెలుగు థియేటర్ సినిమాలు:

బకాసుర రెస్టారెంట్‌‌:

కమెడియన్‌‌, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పిస్తున్న నటుడు ప్రవీణ్.. ‘బకాసుర రెస్టారెంట్‌‌’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎస్‌‌జే శివ దర్శకత్వంలో లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌‌ ఆచారి నిర్మించిన ఈ మూవీ రేపు శుక్రవారం (ఆగస్ట్ 8న) విడుదలవుతోంది.

కథ: ‘ఐదుగురు బ్యాచిలర్స్‌‌ లైఫ్‌‌లోకి ఓ తిండిపోతు దెయ్యం వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ చిత్ర కథ. తిండిపోతు దెయ్యం పెట్టే ఇబ్బందుల నుంచి వచ్చే హాస్యం, ఎమోషన్‌‌ సినిమాకు ప్రధాన బలమవుతాయని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఇది హారర్, థ్రిల్లింగ్‌‌, మైథాలజీ అంశాలు కలగలిసిన కథ అని టాక్. 

రాజు గాని సవాల్:

లెలిజాల రవీందర్ హీరోగా నటిస్తూ దర్శకనిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘రాజు గాని సవాల్’. రితికా చక్రవర్తి హీరోయిన్. అన్నాచెల్లెలు అనుబంధాన్ని ఇందులో ఆవిష్కరించనున్నారు.

ALSO READ : కార్మికుల వేతనాల పెంపుపై భగ్గుమన్న చిన్న నిర్మాతలు.. 

అలాగే, తెలంగాణలో ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుందనే కోణంలో తెరకెక్కించారు. ఎంటర్ టైన్ మెంట్​తో పాటు ఎమోషనల్ డ్రామా ప్రధానంగా సాగే సినిమా ఇదని మేకర్స్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 

సు ఫ్రం సో  (తెలుగు డబ్):

కన్నడలో చిన్న చిత్రంగా విడుదలైన ‘సు ఫ్రం సో’ తెలుగులోకి వస్తోంది. ఈ సినిమా కన్నడలో సూపర్ సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది. ఈ సందర్భంగా రాఖీ స్పెషల్ గా ‘సు ఫ్రం సో’ మూవీ రేపు (ఆగస్టు 8న) విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.

జెపీ తుమినాడ్ దర్శకత్వం వహిస్తూ కీలకపాత్ర పోషించాడు. ఇందులో శనీల్ గౌతమ్ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించగా శాంధ్య ఆరకెరె, ప్రకాశ్ తుమినాడ్ ఇతర పాత్రలు పోషించారు.  అలాగే ప్రముఖ కన్నడ దర్శకనిర్మాత రాజ్‌‌‌‌‌‌‌‌ బి శెట్టి సహనిర్మాతగా వ్యవహరించడంతో పాటు అతిథి పాత్ర పోషించాడు.  

కథ: ఓ చిన్న గ్రామంలో ఆవారాగా తిరిగే అశోక్‌‌‌‌‌‌‌‌ అనే కుర్రాడిని సోమేశ్వర నుంచి వచ్చిన సులోచన అనే దెయ్యం ఆవహించిందని పుకార్లు వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఆ ఊర్లో కొన్ని ఊహించని సంఘటనలు జరగడం, జనంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో రూరల్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కించారు.గ్రామాల్లో సహజంగా ఉండే మూఢ నమ్మకాలు, జానపద కథల మేళవింపుతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. 

అతడు రీ రిలీజ్:

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 20ఏళ్ల క్రితం వచ్చిన ‘అతడు’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తుంది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌‌పై మురళీ మోహన్ నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 9న మహేష్ బర్త్‌ డే  కానుకగా సూపర్ 4కే క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఎక్సెల్ బ్యానర్‌‌పై  జితేంద్ర గుండపనేని ఈ మూవీ రీ రిలీజ్ రైట్స్ ను తీసుకున్నారు. ఆగస్ట్ 8న ప్రీమియర్ షోస్ పడనున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో సైతం దుమ్మురేపుతోంది. 

ఓటీటీ సినిమాలు:

ఈ వారం ఓటీటీలో ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది. 'అరేబియా కడలి' (అమెజాన్ ప్రైమ్), 'మోతెవరి లవ్ స్టోరీ' (జీ5), తెలుగు పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ 'మయసభ' (సోనీ లివ్) వంటి తెలుగు వెబ్ సిరీస్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీటితో పాటు తమిళం నుంచి 'ఓ ఎంథన్ బేబీ' (నెట్‌ఫ్లిక్స్), 'పరందు పో' (హాట్‌స్టార్), మలయాళం నుంచి 'నడికర్' (సైనా ప్లే) వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఈ వారంలోనే కిరీటి రెడ్డి , శ్రీలీల నటించిన 'జూనియర్' సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇలా అన్ని జోనర్ల సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్ ఏంటో చూద్దాం. 

జీ5:

మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు రూరల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 08

మామన్ (తమిళ మూవీ) - ఆగస్టు 08

జరన్ (మరాఠీ సినిమా) - ఆగస్టు 08

అమెజాన్ ప్రైమ్:

ది పికప్ (ఇంగ్లీష్ కామెడీ హీస్ట్ అడ్వెంచర్ సినిమా)- ఆగస్టు 06

అరేబియా కడలి (తెలుగు సిరీస్) - ఆగస్టు 08

సోనీ లివ్:

మయసభ (తెలుగు సిరీస్) - ఆగస్టు 07

నెట్‌ఫ్లిక్స్:

ఎస్ఈసీ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05

టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05

వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1  (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - ఆగస్టు 06

ఓ ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08

స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08

మ్యారీ మీ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10

ఈటీవీ విన్ ఓటీటీ:

బద్మాషులు (తెలుగు కామెడీ డ్రామా)- ఆగస్టు 07

హాట్‌స్టార్:

ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడీ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 04

పరందు పో (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 05

లవ్ హర్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07

మిక్కీ 17 (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 07

సలకార్ (హిందీ సిరీస్) - ఆగస్టు 08

SUN NXT:

హెబ్బులి కట్ (కన్నడ సినిమా) - ఆగస్టు 08

మాయకూతు (తమిళ ఫాంటసీ క్రైమ్ డ్రామా)- ఆగస్టు 08

ఆపిల్ ప్లస్ టీవీ:

ప్లాటోనిక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06

MX ప్లేయర్:

బిండియే కే బాహుబలి (హిందీ సిరీస్) - ఆగస్టు 08

సైనా ప్లే:

నడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 08

లయన్స్ గేట్ ప్లే:

ప్రెట్టీ థింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 08

బ్లాక్ మాఫియా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08

తెలుగులో బకాసుర రెస్టారెంట్‌, అతడు, సు ఫ్రం సో థియేటర్స్ లోకి వస్తుండగా.. మయసభ, అరేబియా కడలి, బద్మాషులు, మోతెవరి లవ్ స్టోరీ, నడికర్, వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1, ఓ ఎంథన్ బేబీ, పరంతు పో, సలకార్, మిక్కీ 17, లవ్ హర్ట్స్, మామన్, జరన్ వంటి సినిమాలు ఓటీటీలో స్పెషల్‌గా ఉన్నాయి.