స్టీమ్ ఎంగేజ్ ..గన్​ పోయింది

స్టీమ్ ఎంగేజ్ ..గన్​ పోయింది

డ్రగ్స్​ మాఫియా

టైటిల్​ : సాస్, బహు ఔర్ ఫ్లెమింగో 
సీజన్ 1, డైరెక్షన్​ : హోమి అదజానియా
కాస్ట్ :  డింపుల్ కపాడియా, ఇషా తల్వార్, అంగీరా ధర్, రాధికామదన్, దీపక్ డోబ్రియాల్, నసీరుద్దీన్ షా, మోనికా డోగ్రా, వరుణ్ మిత్ర, ఆశిష్ వర్మ, ఉదిత్ అరోరా, జిమిత్ త్రివేది, విపిన్ శర్మ
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్​ ఫాం :  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఈ సిరీస్​ కథ మొత్తం ఫ్లెమింగో అనే డ్రగ్​ మీదే నడుస్తుంది. రాణి (డింపుల్ కపాడియా) తన గ్రామంలోనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. ఇంట్లోనే మహిళా కార్మికులతో ఫ్లెమింగో అనే డ్రగ్ తయారుచేయిస్తుంటుంది. అది కొకైన్​కి స్ట్రాంగ్​ వెర్షన్​లా ఉంటుంది. దాన్ని వాళ్లు ఇంటర్నేషనల్​ మార్కెట్​లో కూడా అమ్ముతారు. అయితే.. ఈ బిజినెస్​ మొత్తాన్ని రాణి కూతురు, ఇద్దరు కోడళ్లు చూసుకుంటారు. కొడుకులు హరీష్ (ఆశిష్ వర్మ), కపిల్ (వరుణ్ మిత్ర) విదేశాల్లో స్థిరపడతారు. వాళ్లు ఇంటికి తిరిగి వచ్చే టైంలోనే డిప్యూటీ సీఎం కొడుకు ఫ్లెమింగో డ్రగ్ ఓవర్​ డోస్​ తీసుకోవడంతో హాస్పిటల్​లో చావు బతుకుల మధ్య ఉంటాడు. కానీ.. వాస్తవానికి అతను తీసుకుంది నకిలీ ఫ్లెమింగో అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది. రాణి కూతురు శాంత (రాధికామదన్), కోడలు బిజిలీ (ఇషా తల్వార్) ఎలా బిజినెస్​ చేశారు? తెలుసుకోవాలంటే సిరీస్​ చూడాల్సిందే. ప్రతి ఎపిసోడ్​కి ఒక ట్విస్ట్​ ఉండడంతో సీజన్​ మొత్తం ఇంట్రస్టింగ్​గా అనిపిస్తుంది. కాకపోతే.. ఎపిసోడ్ల నిడివి ఎక్కువగా ఉండడంతో స్టోరీ కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. స్క్రీన్​ ప్లే బాగుంది. అందరూ బాగా యాక్టింగ్​ చేశారు.  సీజన్​ ఎండింగ్​లో రెండో సీజన్ హింట్​ కూడా ఇచ్చారు.

గన్​ పోయింది

టైటిల్​ : కరోనా పేపర్స్
డైరెక్షన్​ : ప్రియదర్శన్
కాస్ట్ : షేన్ నిగమ్, షైన్ టామ్ చాకో, సిద్దిక్, జీన్ లాల్, గాయత్రి, మణియన్‌పిల్ల రాజు, విజిలేష్ కరాయద్, హన్నా రెజి కోశి, సంధ్యా శెట్టి, వినీత్ శ్రీనివాసన్
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

రాహుల్ నంబియార్ (షైన్ నిగమ్) ఎస్​ఐ ఉద్యోగంలో చేరతాడు. అయితే.. తన పైఆఫీసర్ ఒక కేసులో రూల్స్​ని అతిక్రమించి ఇన్వెస్టిగేషన్​ చేయాలని చెప్తాడు. దాంతో అతను ఇన్వెస్టిగేషన్​ చేయడానికి వెళ్తాడు. అదే టైంలో బస్సులో రాహుల్ గన్​ను ఓ దొంగ కొట్టేస్తాడు. తర్వాత ముగ్గురు దొంగలు కలిసి అదే గన్​తో బ్యాంక్​ దొంగతనం చేస్తారు. ఆ దొంగల్ని పోలీసులు పట్టుకున్నారా? రాహుల్​ గన్​ దొరికిందా? కేసును లీడ్ చేస్తున్న డీఎస్పీ గ్రేసీ (సంధ్యా శెట్టి), దొంగతనం చేసిన టీమ్ హెడ్ గోవిందు (సిద్ధిక్)కు ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాలి. 
జపాన్​కు చెందిన డైరెక్టర్ అకిరా కురొసావా 1949లో తీసిన ‘స్ట్రే డాగ్’ సినిమా ఇన్​స్పిరేషన్​తో తమిళ సినిమా 8 తోట్టకల్ (8 బుల్లెట్లు) వచ్చింది. దానికి రీమేక్​గా కరోనా పేపర్స్​ తీశారు. ఇదే సినిమాని తెలుగులో సేనాపతిగా రీమేక్ చేశారు. కరోనా టైంలో బ్యాంక్ రాబరీ జరిగిందనే ఒకే కారణంతో సినిమాకు కరోనా పేపర్స్ అని టైటిల్ పెట్టారు. తప్పితే కరోనా గురించి సినిమాలో ఎక్కడా కనిపించదు. ఎస్సైగా షైన్ నిగమ్ బాగా చేశాడు. సిద్ధిక్ తన యాక్టింగ్​తో మెప్పించాడు. మిగతావాళ్లు ఫర్వాలేదనిపించారు.

ఓ చందమామ కథ

టైటిల్​ : పార్థ్​ ఔర్ జుగ్ను ,డైరెక్షన్​ : హేమంత్​ గబ, కాస్ట్ : హర్షిత్ భోజ్వానీ, మధు షా, ఏకం బింజ్వే, మీట్ ముఖి, అనయా సింగ్, అక్షత్

లాంగ్వేజ్ : హిందీ, ప్లాట్​ ఫాం :  జీ 5

పద్నాలుగేండ్ల పార్థ్​(మీట్ ముఖి) తన ఫ్యామిలీతో కలిసి భీమ్ ముక్తేశ్వర్​ హిల్ స్టేషన్ ప్రాంతంలో ఉంటాడు. పార్థ్​ తొమ్మిదో తరగతిలో ఫెయిల్ కావడంతో అతన్ని అందరూ అవమానిస్తుంటారు.  బాధతో ఒకరోజు కోపంతో ఇంటి నుంచి పారిపోయి దగ్గర్లోని హిమాచల్ కొండల్లోకి వెళ్లిపోతాడు. అక్కడ జుగ్ను (ఏకం బింజ్వే) అనే పిల్లవాడితో స్నేహం కుదురుతుంది. తర్వాత పార్థ్​ జుగ్నుకి తన స్కూల్ ఫ్రెండ్స్​ని పరిచయం చేస్తాడు. వీళ్లంతా కలిసి విలన్​ నుండి ప్రపంచాన్ని రక్షించేందుకు పోరాడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? తెలుసుకోవాలంటే సిరీస్​ చూడాలి.
పిల్లలంతా చాలా డీసెంట్‌గా నటించారు. ఇది క్లీన్, కిడ్- ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్. బెస్ట్​ అవుట్​పుట్​ ఇవ్వడానికి మేకర్స్ బాగా ట్రై చేశారు. విజువల్​ ఎఫెక్ట్స్​ బాగున్నాయి.