
- 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డ వాహనదారులు
హైదరాబాద్,వెలుగు: ఆది, సోమవారాల్లో డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరిగి నలుగురి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వరుస ప్రమాదాలతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ సిబ్బందితో కలిసి డ్రంకన్ డ్రైవ్,రోడ్డు ప్రమాదాలను నివారణకు తీసుకోవలసిన చర్యలపై డిస్కస్ చేశారు. వాహనదారులు,పబ్స్, బార్ ఓనర్లకు అవెర్ నెస్ కల్పించేలా ప్లాన్ చేశారు. పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్‌లో ప్రతి ఏటా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్న వారిలో బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్(బీఏసీ) లెవల్స్ 150 నుంచి అత్యధికంగా 205 వరకు ఉంటోంది. ఈ ఏడాది నవంబర్ వరకు డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ గ్రేటర్ పరిధిలో మొత్తం 63,303 మంది వాహనదారులు పోలీసులకు చిక్కారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు
మెయిన్ రోడ్లతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే రూట్లలో కనీసం 3 స్పెషల్ టీమ్స్‌పెడుతున్నారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు సెర్చ్ చేస్తున్నారు. బార్ల సమీపంలో డ్రంకన్ డ్రైవ్ చెకింగ్ నిర్వహిస్తున్నారు.
3 కమిషనరేట్లలో నమోదైన కేసులు
కమిషనరేట్ 2020 2021(నవంబర్)
హైదరాబాద్ 27,737 21,077
సైబరాబాద్ 8,399 36,000
రాచకొండ 3,919 6,226
మొత్తం 40,055 63,303