ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఆమోదించకపోతే రాజ్​భవన్​ను ముట్టడిస్తం: థామస్ రెడ్డి

ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఆమోదించకపోతే రాజ్​భవన్​ను ముట్టడిస్తం: థామస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ తమిళిసై వెంటనే ఆమోదించాలని ఆర్టీసీ టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రాజ్ భవన్ ను మళ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. బుధవారం సెక్రటేరియెట్ మీడియా పాయింట్​లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ బిల్లు ఆమోదించి వారం దాటిందన్నారు. ఇంకా గవర్నర్ ఆమోదించలేదని చెప్పారు. ఏపీలో పర్యటించి అక్కడి కార్మికులు, అధికారులను కలిసి వివరాలు సేకరించామని, ఆ రిపోర్ట్​ను ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. ఈ నెల నుంచే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.