బీఆర్ఎస్ ఎమ్మెల్యే డౌన్ డౌన్..తొండపల్లి గ్రామస్తుల నిరసన

 బీఆర్ఎస్ ఎమ్మెల్యే డౌన్ డౌన్..తొండపల్లి గ్రామస్తుల నిరసన

వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి నిరసన సెగ తగింది. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా తొండపల్లి గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే  మహేష్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు కనీస సమాచారం లేకుండా గ్రామంలో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని సర్పంచ్తో పాటు గ్రామస్తుల నిరసన తెలిపారు. సర్పంచ్తో పాటు..గ్రామస్తులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 

ఎమ్మెల్యే డౌన్ డౌన్..

తొండపల్లి గ్రామంలో చేయని పనులను కూడా బ్యానర్లో వేయించారని సర్పంచ్ తో పాటు..గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను నిలదీసేందుకు వెళ్తున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకోవడంతో..ఆగ్రహించారు.,ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమకు ఎమ్మెల్యేను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు తమ సమస్యలను చెప్పేందుకు వెళ్తుంటే ఆయన అనుచరులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఫోటోలు వీడియోలు తీస్తే.., ఫోన్లు లాగేసుకుంటున్నారని వాపోయారు. 

నిధులు ఏమయ్యాయి..

తొండపల్లి గ్రామంలో దాదాపు 65 లక్షల రూపాయల నిధులతో పనులు చేయించామని ఎమ్మెల్యే అనుచరులు బ్యానర్ వేశారని....మరి ఆ  నిధులు ఎక్కడికిపోయాయని సర్పంచ్ గీత ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టు లేకుండా తమ గ్రామంలో 20 ఎకరాలకు సాగునీరు ఎలా అందించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము లేకుండా గ్రామాభివృద్ధి ఎలా జరిగిందో చెప్పాలని నిలదీశారు.