
OTTల కంటెంట్‌ను కాపీ చేస్తున్న తోప్ టీవీ యాప్ నిర్వాహకుడు సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సతీష్.. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5, నెట్‌ప్లిక్స్, ఆహా లాంటి పలు OTTలకు సంబంధించిన కంటెంట్‌ను కాపీ కొడుతున్నాడు. అంతేకాదు ఆ కంటెంట్ ను తోప్ టీవీ యాప్‌లో అప్‌లోడ్ చేస్తూ..గత రెండేళ్లుగా ఫ్రీగా విడుదల చేస్తున్నాడు. దీనిపై పలు OTT లు మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.గుర్రంగూడలో ఉంటున్న సతీష్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ముంబై కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు.
నిందితుడు సతీష్ ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.