
లోక్ సభలో రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ చేసిన విమర్శలపై ఇండియా కూటమి నేతలు మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇంకా చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తున్నాడని.. మోదీ అన్న మాటలకు ఇండియా కూటమి నేత అఖిలేష్ యాదవ్ కౌంటరిచ్చారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన సమస్యలపై సమాధానం చెప్పలేకనే ప్రధాని మోదీ ఈ విమర్శలు చేస్తున్నారు.. నీట్ వంటి సమస్యలపై ప్రధాని మోదీ దగ్గర సమాధానం లేదని అఖిలేష్ యాదవ్ అన్నారు.
రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి సమాధానమిస్తూ రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎదురుదాడికి దిగారు. సోమవారం సభలో రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ రాహుల్ వ్యాఖ్యలపై మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ కూడా రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని చేసిన "బాలక్ బుద్ధి"పై ఎదురుదాడి చేసింది. నీట్‌పై ఎవరూ ప్రశ్నలు వేయకూడదని విషయాన్ని ఇలా పక్కదోవ పట్టిస్తున్నారని .. బాలక్ బుద్ధి చెప్పేవాళ్లే బాలక్(పిల్లలు) కాబట్టి.. ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అఖిలేష్ అన్నారు. ప్రభుత్వంలో ఇప్పటికీ చేతకాని బాలక్‌లున్నారు... దేశ సమస్యలను అర్థం చేసుకోవాలని అవసరం ఉందన్నారు కనౌజ్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ .