దేవుళ్లు మీరు : 50 వేల చీటింగ్ అయినా కంప్లయింట్ చేయొచ్చు

దేవుళ్లు మీరు : 50 వేల చీటింగ్ అయినా కంప్లయింట్ చేయొచ్చు

ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చాలామంది బాధితులకు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమందికి వెంటనే న్యాయం జరుగుతోంది. మరికొంతమందికి కాస్త ఆలస్యం అవుతోంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అయితే.. సైబర్ నేరాలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి కొత్త విషయం చెప్పారు.

సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఇకపై ఫిర్యాదు చేయవచ్చని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. బాధితులు రూ. 50 వేల వరకు పోగొట్టుకుంటే స్థానిక పీఎస్‌లోనే ఫిర్యాదు చేయవచ్చన్నారు.

గతంలో సైబర్ క్రైమ్స్ ఆర్ధిక నేరాల విషయంలో ఒక లక్షా 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేవారు. ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువ కావడంతో సైబరాబాద్ సీపీ పలు సూచనలు చేశారు. ఈ కేసులను ఇన్ స్పెక్టర్, డీఐ ర్యాంక్ అధికారులు దర్యాప్తు చేస్తారని చెప్పారు.