సంగీతంతో చదువూ బాగొస్తది

సంగీతంతో చదువూ బాగొస్తది

కళల్లో సంగీతానిది ప్రత్యేక స్థానం. ప్రతీ ఒక్కరిని కదలకుండా చేసే శక్తి దీని సొంతం. మ్యూజిక్‌‌‌‌తో రోగాలను కూడా నయం చేయొచ్చని విన్నాం. తాజాగా సంగీతంతో ఇంకో అద్భుతం కూడా జరుగుతుందని వెల్లడైంది. సంగీతం నేర్చుకునే (ఏదైనా ఓ వాయిద్యం వాయించడం) హైస్కూల్‌‌‌‌ స్టూడెంట్లు మ్యాథ్స్‌‌‌‌, సైన్స్‌‌‌‌, ఇంగ్లిష్‌‌‌‌లలో తోటి స్టూడెంట్ల కన్నా ముందుంటున్నారని, మంచి ఫలితాలొస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. సర్వే వివరాలను ఎడ్యుకేషనల్‌‌‌‌ సైకాలజీ జర్నల్‌‌‌‌లో పబ్లిష్‌‌‌‌ చేశారు. 2012 నుంచి 2015 మధ్య 12వ తరగతి పూర్తి చేసిన సుమారు 1.12 లక్షల మంది స్టూడెంట్ల వివరాలను సర్వేలో భాగంగా సేకరించారు. మ్యాథ్స్‌‌‌‌, సైన్స్‌‌‌‌, ఇంగ్లిష్‌‌‌‌లలో ఒక్కటైనా పరీక్ష రాసిన వాళ్లనే ఎంపిక చేసుకున్నారు. మ్యూజిక్‌‌‌‌ నేర్చుకుంటున్న స్టూడెంట్లు చదువులో బాగా రాణిస్తున్నారని వెల్లడైంది. ముఖ్యంగా సంగీతం పాడటం కన్నా వాయిద్యం వాయించడం నేర్చుకుంటున్న వారిలో ఈ ప్రభావం ఎక్కువ కనబడిందని.. చేయి, కళ్లు, మెదడు కో ఆర్డినేషన్‌‌‌‌ పెరిగి చదువుపైనా ప్రభావం చూపిస్తోందని తెలిసింది. ఎలిమెంటరీ స్కూళ్లలో ట్రైన్డ్‌‌‌‌, హైలీ స్కిల్డ్‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌ ట్రైనర్లను పెట్టుకోవడం, వాయిద్యాలను కొనడం కుదరదు కాబట్టి ఆ స్టూడెంట్లు వెనకబడ్డారని సర్వే తేల్చింది.