తోట ధృవ చెస్​ చాంపియన్

తోట ధృవ చెస్​ చాంపియన్

హైదరాబాద్, వెలుగు : సీనియర్​చెస్​చాంపియన్​షిప్– 2024 పోటీల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన బాలుడు ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు ఎల్బీ స్టేడియంలో పోటీలు జరగగా, వివిధ జిల్లాలకు చెందిన 180 మంది పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన తోట ధృవ 8 పాయింట్లతో టాప్​లో నిలిచి ట్రోఫీ, రూ.5వేల నగదు బహుమతి సాధించాడు. ట్రోఫీ అందజేత కార్యక్రమంలో తెలంగాణ చెస్​అసోసియేషన్​ప్రెసిడెంట్​కె.ఎస్.ప్రసాద్ పాల్గొన్నారు.