బ్రిటన్‌లో కొత్తగా వచ్చి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న మరో రకం కరోనా వైరస్ వ్యాప్తితో… ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. కొత్త రకం కరోనా వైరస్ విషయంలో కూడా ఇప్పటి వరకు అనుసరిస్తున్న జాగ్రత్తలనే పాటించాలని సూచించింది. అంతేకాదు జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదని హెచ్చరించింది. ఈ కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటి దాకా అదుపు తప్పలేదని, ఇంత కాలం పాటించినట్లుగానే కరోనా జాగ్రత్తలు పాటిస్తే కొత్త రకం కరోనా వైరస్ ను సమర్ధంగా తిప్పి కొట్టగలమని చెప్పింది. అజాగ్రత్త వహిస్తే ప్రమాదం తప్పదని తేల్చిచెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
