చంపుతామని బెదిరించారు…పోటీ నుంచి తప్పించారు

చంపుతామని బెదిరించారు…పోటీ నుంచి తప్పించారు

చంపుతానని బెదిరించి బలవంతంగా పోటీ నుంచి తప్పించారని నాగర్ కర్నూల్ జిల్లా గగ్గలపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా పక్కకు తప్పుకున్న కాంగ్రెస్ నేత దొడ్ల వెంకటనారాయణ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంపీపీ అభ్యర్థి తనపై బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. తమ అత్తగారింట్లో ₹10 లక్షల డబ్బువిసిరేసి పోయారన్నారు. సోమవారం ఆ డబ్బును తీసుకుని నా గర్ కర్నూల్ కలెక్టర్ దగ్గరకు వెళ్లారు.ఆయన అందుబాటులో లే కపోవడంతో డీఆర్ వో మధుసూదన్ నాయక్ , జిల్లా ఎస్పీని కలిసి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. నాగర్ కర్నూల్ మండల పరిషత్​ స్థానాన్నిజనరల్ కు కేటాయించారు. గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి టీఆర్ ఎస్ తరఫున దొడ్ల ఈశ్వర్ రెడ్డి పోటీలో ఉండగా, కాంగ్రెస్ తరఫున దొడ్ల వెంకటనారాయణ రెడ్డి బరిలో నిలబడ్డారు. ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం వెంకటనారాయణ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు.

కారులో తీసుకెళ్లి…

ఆదివారం మధ్యాహ్నం తనను టీఆర్ ఎస్ నేతలు శేఖర్ గౌడ్ , సు రేశ్ గౌడ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని ఉయ్యాలవాడకు తీసుకెళ్లారని వెంకటనారాయణరెడ్డి చెప్పారు.’అక్కడే ఉన్న టీఆర్ ఎస్ ఎంపీపీ అభ్యర్థి ఈశ్వర్ రెడ్డి.. ‘నేను గెలిస్తే ఎంపీపీ అవుతా. నువ్వు గెలిచి ఏం చేస్తావ్’ అంటూ బెదిరించారు. ₹25 లక్షలు తీసుకుని పోటీ నుంచి తప్పుకోవాలని లేదంటే చస్తావని బెదిరించారు. కుటుంబ సభ్యులు, మద్దతుదారులు క్షేమంగా ఉండరని హెచ్చరించారు. అక్కడి నుం చి ఎంపీడీవో కార్యా లయానికి తీసుకెళ్లి బలవంతంగా విత్​డ్రా పేపర్లపై సంతకం చేయించారు. ఊళ్లో ఉండొద్దంటూ బెదిరించి వెళ్లిపోయారు. అత్తగారింట్లో ఉన్న నా భార్య దగ్గరకెళ్లి ₹10 లక్షలు విసిరేసి విత్​డ్రా చేసుకోమని చెప్పి బెదిరించి వెళ్లారు. దీంతో తాండూరుకు వెళ్లిపోయా. సోమవారం నా భార్య తాండూరుకు రావడంతో అక్కడి నుంచి నాగర్ కర్నూల్ వెళ్లాం అని ఆయన చెప్పారు. ఈశ్వర్ రెడ్డిపై చర్యలు తీసు కోవాలని కోరారు. డబ్బులు తీసుకుని కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డబ్బు తీసుకునే అధికారం కలెక్టర్ కు మాత్రమే ఉందని, కలెక్టర్ ఆఫీసులో ఇవ్వాలని సూచించారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.