
జవహర్ నగర్, వెలుగు: బైక్చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్టయ్యారు. జవహర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనాల చోరీపై వరుస ఫిర్యాదులు వస్తుండటంతో జవహర్ నగర్ క్రైం డీఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన మహమ్మద్ అబ్దుల్ కలాం, జూలు వెంకటేశ్, సాయిని రామ్ ప్రసాద్ గా గుర్తించారు.
ఆదివారం వారిని అరెస్ట్చేశారు. చెడు వ్యసనాలకు బానిసలై బైక్లు చోరీ చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 13 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జవహర్నగర్పోలీసులను కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి అభినందించారు.