సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

నేరెడ్​మెట్​, వెలుగు:  ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సైబర్ నేరగాళ్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఘట్​కేసర్ కి చెందిన బానోతు కిరణ్​ కుమార్ ​ ప్రాంతానికి చెందిన బానోతు కిరణ్​ కుమార్​ తన మొబైల్​కి కొందరు లింక్​ను పంపించి..ఆన్​లైన్ ఇన్వెస్ట్​మెంట్ పేరుతో రూ.86 లక్షలను కొట్టేశారని ఈ ఏడాది అక్టోబర్ 22న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నవంబర్​ 3న వెస్ట్​ బెంగాల్​లోని సిలిగురి ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులు నూర్​ ఆలం, అక్రం హుస్సేన్​, ఎండీ ఇజ్రాల్​ను అదుపులోకి తీసుకుని  రూ. 15 లక్షలు  సీజ్​ చేశారు. విచారణలో భాగంగా  ప్రధాన నిందితుడు సూత్రదారి  దీపు మండల్​ ​   సిలిగురిలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి  ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. శుక్రవారంసికింద్రాబాద్ ​రైల్వే స్టేషన్​ వద్ద దీపు మండల గ్యాంగ్ కి చెందిన నేపాలీలు గోపాల్​ శేర్ప (24), సుశీల్​ గురుంగ్​ (29), నిమతమంగ్​ అలియాస్​ అమ్రిత్​తమంగ్ (24)ను అదుపులోకి తీసుకున్నారు.   53 సెల్ ఫోన్లు, 215 సిమ్​లు, లక్ష క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.  అకౌంట్​లోని  10 లక్షలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడైన దీపు మండల్​ కోసం గాలిస్తున్నామని సీపీ మహేశ్​భగవత్ తెలిపారు.