
బషీర్‌బాగ్, వెలుగు: కొకైన్ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అరెస్ట్‌చేసింది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు రాంకోఠి వర్ధమాన బ్యాంక్ వద్ద ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపారు. వారి వద్ద నుంచి 33.3 గ్రాముల కొకైన్స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు నాంపల్లికి చెందిన మిస్బాహిద్దీన్ ఖాన్, బంజారాహిల్స్ కు చెందిన అలీ అజ్గర్ గులాబ్, జుబైర్ అలీ(యూఎస్ఏ)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మిస్బాహిద్దీన్ ఖాన్, అజ్గర్ గులాబ్తరచూ పార్టీల్లో కొకైన్వాడుతున్నట్లు తేలింది. హైదరాబాద్ లో దొరక్కపోవడంతో బెంగళూరులో ఏడాది క్రితం ఓ పార్టీలో పరిచయమైన మహమ్మద్ అజారుద్దీన్ వద్ద ఒక గ్రాము కొకైన్‌ను రూ.9 వేలకు కొనుగోలు చేస్తున్నారు.
యూఎస్ఏ సిటిజన్ అయిన జుబైర్ అలీ నెలన్నర క్రితం నగరానికి వచ్చాడు. ఇతని ఇన్నోవా కారునే కొకైన్తీసుకొచ్చేందుకు వినియోగిస్తున్నారు. కొకైన్ సప్లై చేస్తున్న మహమ్మద్ అజారుద్దీన్ పరారీలో ఉన్నాడు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి చర్యల నిమిత్తం నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు.