యువకులపై దాడి కేసులో ముగ్గురు అరెస్ట్

యువకులపై దాడి కేసులో ముగ్గురు అరెస్ట్

ఎల్బీనగర్, వెలుగు: యువకులపై దాడి కేసులో ముగ్గురిని అరెస్ట్​చేసినట్లు చాంద్రాయణగుట్ట డివిజన్ ఏసీపీ ఎ.సుధాకర్ తెలిపారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. బండ్లగూడ జహంగీరాబాద్ కు చెందిన సయ్యద్ అబేద్, సయ్యద్ యూసుఫ్ స్నేహితులు. ఇద్దరూ వెల్డింగ్ పనులు చేస్తుంటారు. యూసుఫ్ కంటికి గాయమవడంతో హాస్పిటలో చూపించేందుకు ఈ నెల 24న మధ్యాహ్నం బైక్ పై హాషమాబాద్ వెళ్తున్నారు.

 మార్గమధ్యలో చాంద్రాయణగుట్ట నుంచి ఆరాంఘర్ కు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. సయ్యద్ అబేద్, యూసుఫ్​కిందపడ్డారు. అంత స్పీడ్ ఎందుకని కారు డ్రైవ్ చేస్తున్న జక్కిని ప్రశ్నించగా.. నన్నే తిడతారా అంటూ అతను మహమ్మద్ అబ్దుల్ సఫి, తన సోదరుడైన మైనర్​తో కలిసి అబేద్, యూసుఫ్​ను చితకబాదాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు.