సోలీపూర్ గ్రామాన్ని ముంచెత్తిన విషాదం

సోలీపూర్ గ్రామాన్ని ముంచెత్తిన విషాదం

రంగారెడ్డి జిల్లా షాద్ ఫరూక్ నగర్ మండలంలోని సోలిపూర్ శివారులో ఓ వెంచర్ నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మ-ృతి చెందిన ఈ ముగ్గురి పిల్లల వయసు పది సంవత్సరాల వరకు ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆడుకుంటూ వెళ్లి నీటి గుంటలో పడ్డట్టు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ముగ్గురు చిన్నారులు అక్షిత్ గౌడ్ , ఫరీద్, ఫరీన్ గా పోలీసులు గుర్తించారు.  చేపలను పట్టాలని, వాటిని చూడాలని సరదా పడుతూ నీటిలోకి దిగారని మరికొందరు చెబుతున్నారు. అనంతంరం నీటిలో మునిగి, ఊపిరాడక చనిపోయినట్లు గ్రామస్తులు అంటున్నారు. ఈ ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన వారందరూ10 సంవత్సరాల లోపు చిన్నారులే ఉండడం అందర్నీ కలచి వేస్తోంది.