జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం(ఆగస్టు7) ఆర్మీజవాన్లతో వెళ్తున్న వాహనం లోయలోపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు చనిపోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉధంపూర్ జిల్లాలోనిబసంత్‌గఢ్ సమీపంలోని కాండ్వా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.187వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బంకర్ వాహనం అదుపు తప్పి లోతైన లోయలోకి జారిపడింది.
జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం(ఆగస్టు7) ఆర్మీజవాన్లతో వెళ్తున్న వాహనం లోయలోపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు చనిపోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉధంపూర్ జిల్లాలోనిబసంత్‌గఢ్ సమీపంలోని కాండ్వా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
187వ బెటాలియన్ కు చెందిన ఆర్మీ జవాన్లు బసంత్ ఘర్ లో ఆపరేషన్ ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 23 మంది జవాన్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది ,స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన జవాన్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్ సలోని రాయ్‌తో మాట్లాడి సహాయక చర్యలను సమీక్షించారు. గాయపడిన వారికి అన్ని విధాలా సహాయం అందించాలని ఆదేశించారు.
ఈ ప్రమాదం ఉదంపూర్ జిల్లాలోని కొండ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ రోడ్డు మార్గాలు తరచూ ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ దుర్ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.