
- భారత సంతతి చిన్నారులు మిస్సింగ్
వాషింగ్టన్: అమెరికాలోని శాన్ డియాగో సిటీకి సమీపంలోని సముద్ర తీరంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. అక్రమ వలసదారులతో వెళ్తున్న ఓ బోటు నీట మునిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. నలుగురు గాయపడ్డారు. ఇండియాకు చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు గల్లంతయ్యారు.
కోస్ట్ గార్డ్ అధికారుల ప్రకారం.. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో పట్టణానికి 15 మైళ్ల దూరంలో 16 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ బోట్ బోల్తా పడింది. రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాక చర్యలు చేపట్టారు. నలుగురిని రక్షించిన రెస్క్యూ టీమ్.. బాధితులను హాస్పిటల్‌కు తరలించింది. ఇంకా ఏడుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.