ఒకే రోజు కుప్పకూలిన మూడు ఫైటర్ జెట్లు

ఒకే రోజు కుప్పకూలిన మూడు ఫైటర్ జెట్లు

భారత వాయుసేనకు చెందిన  మూడు ఫైటర్ జెట్లు ఒకే రోజు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్ లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్లు కూలిపోగా..  రాజస్థాన్లో మరో యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది.  భోపాల్ లో ట్రైనింగ్ లో ఉన్న సుఖోయ్ ఎస్ యూ30, మిరేజ్ 2000 విమానాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన కాసేపటికీ మెరెనా కూలిపోయాయి. ప్రమాదంలో ఇద్దరు పైలెట్లకు  స్వల్ప గాయాలుకావడంతో వారిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. మిరేజ్ ఫైటర్ జెట్ పైలెట్ కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఐఏఎఫ్ కోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది.

మరోవైపు రాజస్థాన్ భరత్ పూర్ లో ఓ విమానం కూలిపోయింది. తొలుత అది చార్టర్ ఫ్లైట్ అని భావించినా అనంతరం అది వాయుసేనకు చెందిన యుద్ధ విమానంగా గుర్తించినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్న అధికారులు పైలెడ్ కోసం వెతుకుతున్నారు.