
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖానాలో పనిచేస్తూ.. ప్రైవేటు హాస్పిటల్ నడిపిస్తున్న ముగ్గురు డాక్టర్లపై వేటు పడింది. భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో విధుల్లో ఉన్న డాక్టర్లు.. దేవ్‌రాజ్, ఎం.రామకృష్ణ, రమేశ్‌చంద్ర డ్యూటీ హవర్స్‌లో తమ సొంత క్లినిక్‌లో పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల్లో బయటపడింది. దీంతో దేవ్‌రాజ్, రామకృష్ణను సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఇంచార్జ్ కమిషనర్ మాణిక్కరాజ్ ఉత్తర్వులిచ్చారు. రమేశ్‌చంద్ర కాంట్రాక్టు పోస్టులో ఉండడంతో ..ఆయన్ను విధుల్లోంచి తొలగించాలని దవాఖాన సూపరింటెండెంట్‌ను మాణిక్కరాజ్ ఆదేశించారు.