వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌‌లో దేశం నుంచి మూడు వర్సిటీలు

వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌‌లో దేశం నుంచి మూడు వర్సిటీలు

న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్- 200 యూనివర్సిటీల జాబితాలో భారత్ నుంచి మూడు ఐఐటీలకు చోటు దక్కింది. ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీ ఢిల్లీ) అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఐదు స్థానాలను మెరుగుపరుచుకొని, 123వ ర్యాంకు నుంచి 118 గ్లోబల్ ర్యాంకుకు చేరుకుంది. మొత్తం 100కి 65.7 స్కోరును సాధించింది. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీల పనితీరును అంచనా వేసే క్యూఎస్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్-2027ను విడుదల చేసింది.

ఐఐటీ ఢిల్లీ తర్వాత ఐఐటీ బాంబే 134వ స్థానం, ఐఐటీ మద్రాస్ 170వ స్థానంలో నిలిచాయి. పరిశోధనల నాణ్యతను ప్రతిబింబించే ‘సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ’విభాగంలో ఐఐటీ ఢిల్లీ 97.3 స్కోరుతో అద్భుత ప్రదర్శన కనబరిచింది. దేశంలోనే రెండో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఐఐటీ బాంబే... సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీలో 79.3 స్కోరు, మూడో స్థానంలో నిలిచిన ఐఐటీ మద్రాస్.. సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీలో 95.3 స్కోరును సాధించింది.