కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించి..బీజేపీ నేత సజీవ దహనం..చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా

కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించి..బీజేపీ నేత సజీవ దహనం..చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
  • కారుకు నిప్పంటించి తగులబెట్టడంతో మృతి
  • మరో ఇద్దరికి నిప్పు పెట్టి చంపేసిన నిందితులు

రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్: చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొరియా జిల్లా నౌగైన్ గ్రామంలో ఇసుక మాఫియా దారుణానికి పాల్పడింది. ఓ బీజేపీ నేత ప్రయాణిస్తున్న ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ వాహనానికి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆయన సజీవ దహనమయ్యారు. ఈ అమానుష ఘటనలో మరో ఇద్దరు కూడా ఆహుతయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఇసుక క్వారీ, రవాణా కాంట్రాక్టుకు సంబంధించి బీజేపీ నేతలైన భరత్ సింగ్, మనోజ్ త్రిపాఠి వర్గాలకు కొంతకాలంగా తీవ్ర వివాదం నడుస్తోంది. 

మంగళవారం రాత్రి ఈ గొడవపై చర్చలు జరిపి రాజీ కుదుర్చుకోవడానికి భరత్ సింగ్ తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఆయన వచ్చిన ఫార్చ్యూనర్ కారును నిందితులు ఇసుక టిప్పర్లతో అడ్డగించారు. తప్పించుకునే దారి లేకుండా కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు భారీగా ఎగసిపడటంతో కారులోనే ఉన్న భరత్ సింగ్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు.   

నలుగురు నిందితుల అరెస్ట్ఈ

 ఘటనతో కొరియా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడి వెనుక రాజకీయ, మాఫియా కుట్ర ఉందని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనపై చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, ఈ ఘోరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.