కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు లీడర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన సాయన్న, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లోనూ సాయన్నకే టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన చనిపోవడంతో, 2023 ఎన్నికల్లో సాయన్న పెద్ద బిడ్డ లాస్య నందితకు టికెట్ ఇచ్చారు.
ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె.. ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఈ ఉప ఎన్నికలోనైనా తమకు టికెట్ వస్తుందని నగేశ్, క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆశించారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి భవిష్యత్‌లో అవకాశాలు లభిస్తాయని, నిరుత్సాహ పడొద్దని టికెట్ ఆశావహులను కేసీఆర్ బుజ్జగించినట్టుగా తెలిసింది.