పెట్టుబడుల పేరుతో 1.45 కోట్ల చీటింగ్.. ముగ్గురు అరెస్ట్

పెట్టుబడుల పేరుతో 1.45 కోట్ల చీటింగ్.. ముగ్గురు అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో రిటర్న్స్​ఇస్తామని, చీటింగ్​ చేసిన వ్యక్తులను సైబరాబాద్ సైబర్​క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. సైబరాబాద్​కు చెందిన ఓ వ్యక్తికి 2019 జనవరిలో బెంగుళూరుకు చెందిన నిహారిక కాల్ చేసింది. తాను ఎక్స్ టీ స్క్వేర్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​లో పనిచేస్తున్నానని, తమ కంపెనీలో పెట్టుబడి పెడితే పెద్దఎత్తున రిటర్న్స్​ ఇస్తామని నమ్మబలికింది. దాంతో బాధితుడు ఆ కంపెనీలో రూ.2 లక్షల పెట్టుబడులు పెట్టాడు. ఆ తర్వాత అతనిపై ఒత్తిడి తీసుకువచ్చి దశల వారీగా రూ.1.45 కోట్లు పెట్టుబడులు పెట్టించారు.

రిటర్న్స్ గురించి అడిగితే కరోనా, లాక్​డౌన్​తో నష్టాలు వచ్చాయని, త్వరలోనే రిటర్న్స్​ఇస్తామని నమ్మించారు. ఆ తర్వాత కంపెనీకి చెందిన మరో ఇద్దరు కబీర్, జయతో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో.. బాధితుడు సెప్టెంబర్​3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఎక్స్ టీ కంపెనీ బెంగుళూరుకు చెందిన ట్రేడర్ రామేశ్వర్ బెహరా(36), టెలీకాలర్ షేక్​జైనాబ్​అలియాస్​ నిహారిక(29), ఆమె భర్త అక్బర్​ఖాన్​(31)ను అరెస్ట్ ​చేసి శుక్రవారం రిమాండ్​కు తరలించారు.