
- పీయూ వీసీ శ్రీనివాస్
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పీయూ వైస్ చాన్స్ లర్ శ్రీనివాస్ సూచించారు. శనివారం పీయూలోని లైబ్రరీ ఆడిటోరియంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం స్టూడెంట్లకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పీయూ వీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీయూలో ప్రవేశం పొందిన విద్యార్థులను అభినందించారు. కష్టపడి చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. విద్యార్థులు స్కిల్స్ పెంచుకోవాలన్నారు.
ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన నైపుణ్యాలు లేకపోవడంతో రాణించలేకపోతున్నారు. ఎల్ఎల్ బి కోర్సులో అడ్మిషన్ అయిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పి. రమేశ్ బాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రకిరణ్, వైస్ ప్రిన్సిపల్ ఇంజినీరింగ్ కాలేజ్ డాక్టర్ మొహినోద్దీన్, పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ఎం. కృష్ణయ్య, రవికాంత్, ఏ. కరుణాకర్ రెడ్డి, ఎస్ ఎన్ అర్జున్ కుమార్, మాలవి, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.