
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్ గార్డెన్ లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ, లయన్స్ క్లబ్ హైదరాబాద్ మలక్ పేట్ యశోద ఆస్పత్రి, శ్రీ నేత్రా ఆస్పత్రి సనత్ నగర్ సహకారంతో శనివారం ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ శిబిరంలో దాదాపు 300 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు.
శిబిరంలో వైద్య పరీక్షలతోపాటు హెల్త్ కార్డులు లేని 20 మంది జర్నలిస్టులకు యూనియన్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ రషీద్, టీయూడబ్ల్యూజే ఐ జే యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోయిలకొండ నారాయణరెడ్డి, శివశంకర్, యూనియన్ హెల్త్ కన్వీనర్ గద్వాల సంజీవ్ ప్రకాశ్, సభ్యులు నక్క శ్రీనివాస్, గణప రఘు, రాజేశ్ కుమార్, సులిగం సురేష్ కుమార్, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ హరి నారాయణ బట్టాడ్, పట్టణ అధ్యక్షుడు రవికుమార్ గౌడ్, సభ్యులు కన్న జగదీశ్, శ్రీనివాస్ లాహోటి, సాయికుమార్, ఎస్ ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.