
నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి దగ్గర ఇవాళ(శనివారం) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురూ కూడా వలస కూలీలే. చనిపోయిన వారిలో ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. మృతులు కేరళలోని కోజికోడ్‌కు చెందినవారుగా గుర్తించారు. బీహార్ నుంచి కేరళ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.