ఖమ్మం టౌన్,వెలుగు : నగరంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి ఐదు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాపర్తి నగర్‌లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక బైక్‌పై వస్తున్న ముగ్గురు మైనర్లు పోలీసులను చూసి పరారయ్యే ప్రయత్నం చేశారు.
వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, చెడు వ్యసనాలకు బానిసలై చదువులు మానేసి, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. గత రెండు నెలలుగా ఖమ్మం టూ టౌన్, ఖానాపూరం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఐదు బైకులను ఈ ముఠా దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. అరెస్టైన ముగ్గురూ మైనర్లే కావడంతో వారిని న్యాయస్థానంలో హాజరుపరిచామని ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.
