
ఫ్రాన్స్ నుంచి నాన్‌స్టాప్ జర్నీ చేసి జామ్‌నగర్‌లో ల్యాండ్
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్స్ బుధవారం ఇండియా వచ్చాయి. సెకండ్ బ్యాచ్‌కు చెందిన మూడు ఫ్లైట్స్ ఫ్రాన్స్‌లోని ఇస్ట్రస్ నుంచి ఉదయం బయల్దేరి నాన్‌స్టాప్ గా ఎనిమిది గంటలు ప్రయాణించి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ల్యాండ్ అయ్యాయని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఓ ప్రకటనలో చెప్పింది. జర్నీ మధ్యలో ఈ ఫైటర్ జెట్స్‌కు అవసరమైన ఫ్యూయల్ గాలిలోనే నింపడానికి ఫ్రెంచ్ఎయిర్ఫోర్స్కు చెందిన రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి వీటికి తోడుగా వచ్చింది. ఒకే టైమ్‌లో పలు టార్గెట్లపై ఎటాక్ చేయగల కెపాసిటీ ఉన్న రాఫెల్ ఫైటర్‌జెట్స్ తో మన ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం మరింత పెరగనుంది. ఈస్ట్రన్ లఢాక్‌లో చైనా సరిహద్దు వెంట టెన్షన్లు నెలకొన్న నేపథ్యంలో ఈ ఫ్లైట్స్ రావడం గమనార్హం.