కరోనాతో ముగ్గురు ఆఫీసర్ల మృతి

కరోనాతో ముగ్గురు ఆఫీసర్ల మృతి

కరోనాతో ఒకేరోజు వేర్వేరు జిల్లాల్లో ముగ్గురు ఆఫీసర్లు మృతిచెందారు. నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్(37) మన్ననూర్ ఎస్టీ హాస్టల్ లో వార్డెన్ గా చేస్తున్నారు. ఇటీవల ఐటీడీఏ(మాడా)లో అసిస్టెంట్ ​ట్రైబల్ ​డెవలప్​మెంట్​ఆఫీసర్(ఏటీడీవో)​గా  ఇన్​చార్జి బాధ్యతలు చేపట్టారు. కరోనా బారిన పడడంతో పది రోజులు అచ్చంపేటలో ట్రీట్​మెంట్ ​తీసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. శుక్రవారం మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఏటీడీవో మృతిపై సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. 

కోరుట్లలో మిషన్​ భగీరథ ఏఈ..

జగిత్యాల క్రైం, వెలుగు: కరోనా నిండు గర్భిణిని బలి తీసుకుంది. తల్లి నుంచి రెండున్నరేళ్ల చిన్నారిని వేరు చేసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్ పల్లి గ్రామానికి కొక్కు రోహిణి(28),  మేడిపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన చెక్క పల్లి అజయ్ వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఆరోహి అనే రెండున్నరేళ్ల కూతురు ఉంది. రోహిణి ప్రస్తుతం ఏడు నెలల ప్రెగ్నెంట్. భర్త అజయ్ వ్యవసాయం చేస్తుండగా రోహిణి సిరిసిల్ల మున్సిపాల్టీలో మిషన్ భగీరథ ఏఈగా చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం డిప్యుటేషన్​పై కోరుట్లకు వచ్చారు. ఇక్కడే డ్యూటీ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం రోహిణికి కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. 

అల్లాదుర్గంలో సీఆర్పీ..

మెదక్/అల్లాదుర్గం, వెలుగు: మెదక్​ జిల్లా అల్లాదుర్గం ఎంఈవో ఆఫీస్​లో క్లస్టర్​రీసోర్స్​పర్సన్(సీఆర్పీ)గా పని చేస్తున్న దేవకీదేవి(40) కరోనాతో శుక్రవారం మృతిచెందారు. ఈమెకు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.