AMR కాంప్లెక్స్లో లిఫ్ట్ ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

AMR కాంప్లెక్స్లో లిఫ్ట్ ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్లోని పేట్ బషీరాబాద్లో లిఫ్ట్ తెగిపడిపోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. AMR కాంప్లెక్స్లో బుధవారం (ఆగస్టు 16వ తేదీ) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. 3వ ఫ్లోర్ నుంచి లిప్ట్ తెగి.. కిందపడిపోవడంతో అందులో ఉన్న  శివ(21), కీర్తిని(23), సునాయన(23) అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

లిఫ్ట్ కిందపడగానే పెద్ద శబ్ధం వచ్చింది. బాధితులు గట్టిగా కేకలు వేశారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు ప్రమాదం జరిగిన స్థలానికి పరుగెత్తుకుంటూ వెళ్లారు. అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. 

లిఫ్ట్ ప్రమాదంపై బాధితుల తల్లితండ్రులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.