
కర్నూల్ : కర్నూల్ జిల్లా ఓర్వకల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ రాజకీయ సభలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు తూఫాన్ వాహనంలో వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. ఈ తూఫాన్ వాహనాన్ని.. లారీ ఢీ కొట్టింది. ముగ్గురు అక్కకికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు కోడుమూరుకు చెందిన వైసీపీ నేత కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి సంబంధీకులుగా గుర్తించారు. కోడుమూరు నుంచి కడపలో జగన్ సభకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు.
