గుజరాత్ నుంచి ముగ్గురు పీఎంలు

గుజరాత్ నుంచి ముగ్గురు పీఎంలు

అహ్మదాబాద్: దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానిది ​కీలక పాత్ర. లోక్ సభ సీట్ల సంఖ్యలో మాత్రమే కాదు, దేశాన్ని పాలించిన ప్రధానుల విషయంలోనూ యూపీదే రికార్డు. ఇప్పటి వరకు  15 మంది ప్రధానులు దేశాన్ని పాలించగా..అందులో ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్ మూలాలు ఉన్నవారే. తర్వా తి స్థానంలో గుజరాత్ ఉంది.ఇక్కడి నుంచి ముగ్గురు నేతలు ప్రధాని పీఠంపై కూర్చున్నారు. ఇందులో గుల్జారీ లాల్ నందా తాత్కాలిక ప్రధానిగా రెండుసార్లు దేశానికి సేవలం దించారు. మొరార్జీ దేశాయ్ పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసిన గుజరాతీ ప్రధానిగా నరేంద్ర మోడీ చరిత్రకెక్కారు. ఈ క్రమంలో మాజీ ప్రధానుల నేపథ్యం సంక్షిప్తంగా..

గుల్జారీ లాల్ నందా (1964, 1966)

గుల్జారీ లాల్ నందా.. పంజాబ్​ప్రా విన్స్ లోని సియాల్ కోట్ లో జన్మించినా అహ్మదాబాద్ లోనే ఆయన జీవితం గడిచింది . ట్రేడ్ యూనియన్ నేతగా, టెక్స్ టైల్ లేబర్ అసోసియేషన్ నేతగా ఆయన పనిచేశారు. 1962లో లోక్ సభకు ఎన్నికైన నందా, రెండేళ్ల తర్వా త నెహ్రూ చనిపోవడంతో తాత్కాలిక ప్రధాని అయ్యారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించడంతో మరోసారి ప్రధాని సీట్లో కూర్చు న్నారు. రెండు సార్లు పదమూడు రోజుల పాటు దేశాన్ని పాలించారు.

మొరార్జీ దేశాయ్ (1977–79)

గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలోని భాదేలీ గ్రామం మొరార్జీ దేశాయ్​స్వస్థలం. బ్రిటీష్ పాలనలో సివిల్ సర్వెంట్ గా పనిచేసిన దేశాయ్.. తర్వా త తన ఉద్యోగానికి రాజీనామా చేసి స్వా తంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. అవినీతి నిర్మూలన, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. 1977లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన దేశాయ్, రెండేళ్లకే పదవి కోల్పోయారు. రూ.500, రూ.1000,రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేశారు.ఇండియా –పాక్ ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరించారు.

నరేంద్ర మోడీ (2014)

నరేంద్ర మోడీ.. సీఎం సీటు నుంచి ప్రధాని వరకు అన్నింటా రికార్డులు నెలకొల్పిన నేత. గుజరాత్ లో వరుసగా 3 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, సీఎం సీట్లో కూర్చు న్నారు. పాతికేళ్ల సంకీర్ణ ప్రభుత్వాల పాలనకు భిన్నంగా లోక్ సభలో సొంతంగా మెజారిటీ సాధించారు. గుజరాత్ సీఎం కేశుభాయ్​పటేల్ కు ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ మోడీని రాజకీయాల్లోకి పంపించింది.గోద్రా సంఘటన ఆయన రాజకీయ జీవితంలో ఓమచ్చ అనేది వినిపించే ప్రధాన విమర్శ.