
అరుణాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. అసోంకు చెందిన రైఫిల్స్ బలగాలకు, నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్‌కు చెందిన ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ఇండియా-మయన్మార్ సరిహద్దు ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖోగ్లా వద్ద జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున 8గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మణిపూర్‌లో ఉగ్రవాదులు శనివారం మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. మయన్మార్ సరిహద్దులోని చురాచాంద్‌పూర్ జిల్లా సింఘత్‌లో ఈనెల 13న ఉదయం 10 గంటల సమయంలో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై టెర్రర్ ఎటాక్ జరిగింది. ఉగ్రవాదులు చేసిన భయంకర దాడిలో భారత ఆర్మీ కల్నల్, ఆయన భార్య, కుమారుడుతోపాటు మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు.