
ప్రపంచంలో రాబోయే 30 రోజులు ఏం జరగబోతోంది.. మే 15 నుంచి జూన్ 14వ తేదీ మధ్య గ్రహాల మార్పు.. గ్రహాల స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి.. ఏయే గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి అనేది జ్యోతిష్య ప్రపంచంలో ఆసక్తిగా మారింది. దీనికి కారణం.. 2025, మే 15వ తేదీన వృషభ రాశిలోకి రవి (సూర్యుడు) వస్తున్నాడు. విశ్వావసునామ సంవత్సరానికే రాజు అయిన సూర్యుడు.. ఇప్పుడు వృషభ రాశిలోకి మారటం వల్ల.. ప్రపంచ వ్యాప్తంగా పరిణామాలు ఆందోళనకరంగా ఉండొచ్చని.. అదే విధంగా మనుషుల ప్రవర్తనల్లోనూ మార్పులు వస్తాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అవి ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా చెబుతున్నారు.
ప్రపంచంలో పెద్ద మార్పులకు అవకాశం..?
2025, మే 15 నుంచి జూన్ 14 వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ అనిష్ వ్యాస్. భారతదేశంలో కూడా హింస పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మత విశ్వాశాల కారణంగా జనం భయాందోళనలకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు అంటున్నారాయన. భారతదేశంలోని కొన్ని పెద్ద నగరాల్లో కుండపోత వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారాయన.
మన ప్రధాని మోదీ ప్రభుత్వ మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్ అనిష్ వ్యాస్. జూన్, -జూలై నెలల వరకు మోదీ ప్రభుత్వం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారాయన. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లోనూ మార్పులు ఉంటాయని సూచిస్తున్నారు. అంతర్జాతీయంగా మోదీకి మరింత పేరు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారాయన.
Also Read : టూర్ కు వెళ్లాం కదా అని వర్కవుట్ మిస్ చేయొద్దు
ఈ 30 రోజులు వ్యాపారపరంగా చూస్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పుంజుకుంటుందని గట్టిగా చెబుతున్నారు ఈ జ్యోతిష్య పండితులు. విదేశాల్లో రాజకీయ తిరుగుబాటు, అధికార మార్పు మొదలైన వాటికి అవకాశం ఉందని.. భారతీయ స్టాక్ మార్కెట్లలో అకస్మాత్తుగా బూమ్ వస్తుందని చెబుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా.. ఒక వస్తువు ధర పెరిగి.. ఆ వస్తువు మార్కెట్ నుంచే అంతే వేగంగా అదృశ్యం అయ్యే సూచనలు ఉన్నాయని.. వృషభ రాశిలో సూర్యుడి సంచారం ఇలాంటి సంకేతాలనే సూచిస్తుందని చెబుతున్నారు. ఇక అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, గ్యాస్ ప్రమాదం, విమాన ప్రమాదాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గట్టిగానే చెబుతున్నారు.
ఇక వృషభ రాశిలో సూర్యుడు.. 30 రోజుల సంచారం వల్ల.. వ్యక్తిగతంగా అన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలాంటి గ్రహాల కలయిక వల్ల కొంత మందిలో నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రంలో.. సూర్యుడిని ఆత్మను సృష్టించే గ్రహంగా భావిస్తారు. ఈ కారణంగానే.. జనంలో.. మనుషుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని.. జనంలో తెగింపు ధోరణి కనిపిస్తుందని చెబుతున్నారు డాక్టర్ వ్యాస్. సూర్యుని ప్రభావంతో తండ్రి, అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో విజయం లభిస్తుందంటున్నారు. వ్యక్తిగత జాతకంలో సూర్యుడు నీచ పడినట్లు ఉంటే మాత్రం.. అశుభ ఫలితాలు, అపజయాలు, ఉద్యోగ, వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారాయన. వృషభంలో సూర్యుని కలయికతో.. కొందరికి విపరీతమైన ధన నష్టం, స్థల మార్పు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య పండితులు డాక్టర్ అవినాష్ వ్యాస్.