Summer Tour: టూర్ కు వెళ్లాం కదా అని వర్కవుట్ మిస్ చేయొద్దు.. ఇలా చేయండి.. జర్నీ ఇంకా హ్యాపీగా ఉంటుంది..!

Summer Tour: టూర్ కు వెళ్లాం కదా అని వర్కవుట్ మిస్ చేయొద్దు.. ఇలా చేయండి.. జర్నీ ఇంకా హ్యాపీగా ఉంటుంది..!

సమ్మర్​ లో చాలా మంది టూర్​ లకు వెళుతుంటారు.  అక్కడ ఏది పడితే తింటారు.  కాని వ్యాయామం చేయరు.  దీంతో ఆరోగ్య పరంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.  అలా కాకుండా ఉండాలంటే.. టూర్​ కి వెళ్లినప్పుడుకు కూడా వర్కవుట్స్​ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు .  టూర్​ లో ఎలా ఎక్సర్ సైజ్​ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. .  .

రోజు ఏదో ఒక వ్యాయామం చేసే అలవాటుంది చాలామందికి. అయితే వేసవిలో చాలామంది ఓ వారం పది రోజులు లాంగ్ టూర్​ కి  వెళ్తుంటారు. అలా వెళ్లినప్పుడు రోజు వారీ వ్యాయామాలు ఎలా చేయాలా?" అని ఆందోళనపడుతుంటారు. 

Also Read : నిద్రలేకుండా గడిపితే..కండరాలు బలహీనపడతాయా..?

  • పర్యటన సమయంలో కూడా వ్యాయామాలు చేసేందుకు బోలెడు అవకాశాలున్నాయి. హిల్ స్టేషన్స్ కి వెళ్లిన వాళ్లు, అక్కడ ఏదైనా ఎత్తుగా ఉన్న ప్రదేశాలను ఎక్కడం, చేస్తే కార్డియో పర్కవుట్స్ చేసినంత ఫలితం ఉంటుంది. దీని వల్ల శరీర కింద భాగంపై ఒత్తిడి బాగా పడి వ్యాయామం చేసినట్లు అవుతుంది. ఇలా చేయడం వల్ల ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. 
  •  హోటల్స్ లో ఉన్నప్పుడు ఇక్కడి స్విమ్మింగ్ పూల్​ లో  ఈత కొట్టొచ్చు. అలాగే బీచ్​ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈత కొట్టొచ్చు. స్విమ్మింగ్ శరీరానికి మంచి వ్యాయామాన్నిస్తుంది. నీళ్లల్లో ఆక్వా ఏరోబిక్స్ కూడా చేయొచ్చు. స్విమ్మింగ్, ఆక్వా ఏరోబిక్స్ చేయడం వల్ల శరీరం మృదువుగా తయారవుతుంది. 
  •  ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగే జిమ్ ఎక్విప్​ మెంట్ మన వెంట ఉంటే ఎక్క డైనా, బీచ్ ఒడ్డున వర్కవుట్స్ చేయొచ్చు.  స్పాట్​ జాగింగ్, యోగాలాంటివి కూడా చేయొచ్చు. స్కిప్పింగ్ రోప్, రెసిస్టెన్స్ బ్యాండ్స్, లైట్ డంబల్స్ వ్యాయామాలు చేయొచ్చు. సమయం దొరికినప్పుడల్లా స్కిప్పింగ్ ఆడొచ్చు. 
  •  రిసార్ట్ కు దగ్గర్​ లో ఫిట్ నెస్ సెంటర్ ఉంటే అక్కడికెళ్లి వ్యాయామాలు చేయొచ్చు. నైట్ క్లబ్స్ ఉన్నచోట్ల డాన్స్ చేయడం ద్వారా కూడా శరీరానికి నుంచి వ్యాయామం అందుతుంది. 
  •  చాలా టూరిస్ట్ స్పాట్ లో రకరకాల థెరపీలు, మసాజులు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా కూడా శరీరానికి వ్యాయామం అందుతుంది. మసాజ్ ద్వారా రక్తప్రవాహం బాగా జరిగి చర్మానికి మంచి మెరుపు వస్తుంది. 
  • టూర్​ కి  కాకుండా చుట్టాల ఇళ్లకు వెళ్లినవాళ్లు వాళ్ల ఇంటిపనుల్లో పాలుపంచుకోవడం ద్వారా శరీరానికి ఎంతో కొంత వ్యాయామం అవుతుంది. 
  • మెట్లు ఎక్కడం, దిగడం వల్ల ఊపిరితిత్తులకు బాగా వ్యాయామం అవుతుంది. లేవడం, కూర్చోవడం వంటి స్టైలింగ్ వ్యాయామాలు చేస్తే శరీరాన్ని తేలికపరుస్తా యి. అవి ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న వ్యాయామాల ద్వారా టూర్​ లో  వ్యాయామాన్ని కొనసాగేలా చూసుకోవచ్చు