
IMF Fund to Pak: ఆపరేషన్ సిందూర్ కలిగించిన నష్టం నుంచి పాక్ తేరుకోవటానికి దశాబ్ధాల కాలం పడుతుందని యుద్ధ రంగం నిపుణులు చెబుతున్నారు. పైకి తమకేమీ జరగలేదన్నట్లు పాక్ బుకాయిస్తున్నప్పటికీ వాస్తవాలు అంతర్జాతీయ సమాజానికి తెలుసు, పాక్ లోని ప్రజలకూ తెలుసు. తినటానికి తిండి కూడా అందించలేకపోతున్న ప్రభుత్వ పెద్దలు భారతదేశంతో యుద్ధానికి కాలుదువ్వటంపై పాకిస్థాన్ ప్రజలే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇండియాతో స్నేహం తమను అభివృద్ధి దిశగా నిడిపిస్తుందని సోషల్ మీడియాలో వారి ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి.
అయితే జమ్మూ కశ్మీర్ గొడవ లేకపోతే తమకు మనుగడే లేదని తెలిసిన పాక్ పెద్దలు, ఆర్మీ అధికారులు తమ ఆత్మ సంతృప్తి కోసం గోలగోల చేస్తున్నారు. పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటే ఇక చైనా పని కూడా ఔట్. నేరుగా పాకిస్థానులోకి సరకు రవాణా కూడా చైనా చేయలేని పరిస్థితులు వస్తాయని తెలిసిందే. ఇలాంటి దయనీయమైన ఆర్థిక పరిస్థితుల్లో పాక్ పాలకులు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వరుసగా బెయిల్ ఔట్ ప్యాకేజీలు తెచ్చుకునేందుకు అడుక్కుంటున్నారు.
గడచిన వారం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పాకిస్థానుకు అత్యవసరంగా రూ.8వేల కోట్లు అందించేందుకు భారత్ వద్దన్నా అంగీకరించింది. అయితే వారం రోజుల తర్వాత రెండోసారి పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి వెయ్యి 023 మిలియన్ డాలర్లను అందించటనున్నట్లు పేర్కొంది. ఐఎంఎఫ్ అందించే నిధులు వారాంతం నాటికి తమ విదేశీ మారక నిధుల్లో జమ అవుతాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది.
పాకిస్థాన్ నిధులను ఉగ్రవాదానికి దుర్వినియోగం చేస్తోందని, చెప్పిన మాటపై పాక్ నిలబడదని ఇండియా వారించింది. పాకిస్తాన్ సైన్యం అక్కడి ఆర్థిక వ్యవహారాల్లో భారీ జోక్యాన్ని కలిగి ఉండటం వల్ల విధానాల అమలు, దీర్ఘకాలిక సంస్కరణలకు ప్రమాదాలు ఎదురవుతాయని కూడా భారత్ ఐఎంఎఫ్ కి వెల్లడించింది. అలాగే పాకిస్థాన్ ఆర్మీ ఆ దేశ రాజకీయాలు, ఆర్థిక రంగంపై పట్టును కలిగి ఉండటంతో ఊహించిన ఫలితాలు సాధించటం కుదరదని అంతర్జాతీయ సంస్థకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇండియాతో కాల్పుల విరమణకు పాక్ అంగీకరించిన తర్వాత ప్రస్తుతం వేగంగా నిధులను అందుకుంటోంది.