మంచిర్యాల జిల్లాలో మూడున్నర కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లాలో మూడున్నర కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లాలో మూడున్నర కోట్ల రూపాయలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బుధవారం (మే 14) జిల్లా పర్యటనలో భాగంగా భీమారం మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో అభివృధి పనులకు శంకుస్థాపన చేశారు. బూరుగుపల్లి గ్రామం నుండి దాంపూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. 

బూరుగుపల్లి గ్రామంలో సుమారు 3 కోట్ల 35 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వివేక్. బూరుగుపల్లి నుండి దాంపూర్ వరకు రోడ్డు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో గ్రామస్తులు రోడ్డు కావాలని కోరారని.. ఇచ్చిన హామీ మేరకు  3 కోట్ల 35 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్డు వేయడం జరుగుతుందని చెప్పారు.   గత పాలకులు కేవలం ఎన్నికల స్టంట్ కోసమే నిధులు మంజూరు చేశామని చెప్పి  కాగితాలకే పరిమితం చేశారుని అన్నారు. 

ప్రతిపక్ష నాయకులు నిధులు తామే మంజూరు చేయించామని ప్రగల్భాలు పలుకుతున్నారని.. గతంలో నిధులు మంజూరు చేసిఉంటే ఎందుకు అభివృధి చేయలేదని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు రావడం జరుగుతుందని హామీ ఇచ్చారు.