పిడుగు పడి ముగ్గురు యువకులు మృతి

పిడుగు పడి ముగ్గురు యువకులు మృతి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  ముదిగొండలో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెట్రోల్ బంక్ సమీపంలో క్రికెట్ ఆడుతున్న యువకులు వర్షం నుంచి రక్షించుకోవడానికి వేప చెట్టు కింద నిలబడ్డారు. అయితే చెట్టుపై పిడుగు పడడంతో బలంతు ప్రవీణ్, ఇరుగు శ్రీను, గుద్దేటి నవీన్ చనిపోయారు. ఉసికల గోపి అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. అప్పటి వరకు తమతో ఉన్న యువకులు పిడుగు పాటుకు గురై చనిపోవడంతో గ్రామంలో తీవ్ర  విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముదిగొండ ఎస్సై మహేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

three young men killed in thunderbolt in Khammam district