ఖైరతాబాద్, వెలుగు : వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో సిటీలో 47వ సీనియర్ ఇంటర్నేషనల్ త్రోబాల్ చాంపియన్ షిప్ నిర్వహిస్తున్నట్లు స్టేట్త్రోబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్చైర్మన్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జూన్6 నుంచి 8 వరకు హయత్‌నగర్‌లోని వర్డ్ డీడ్ ఎడ్యుకేషన్ అకాడమీలో మూడురోజులపాటు త్రోబాల్పోటీలు ఉంటాయని చెప్పారు.
26 రాష్ట్రాలకు చెందిన 750 మంది క్రీడాకారులు పాల్గొననున్నారని వెల్లడించారు. ఈ నెల 25న వర్డ్డీడ్అకాడమీలో తెలంగాణ త్రోబాల్టీమ్ఎంపిక ఉంటుందని, ఆసక్తిగల క్రీడాకారులు హాజరుకావాలని కోరారు. పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు కృష్ణరాజ్ఫుత్, చిత్ర, కోశాధికారి జమీల్, జాయింట్‌సెక్రటరీ శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు.
