పరిషత్ ఎన్నికల్లో తుమ్మలకు లెఫ్ట్.. రైట్ అయ్యింది!

పరిషత్ ఎన్నికల్లో తుమ్మలకు లెఫ్ట్.. రైట్ అయ్యింది!

జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓటు వేశారు. అయితే  ఓటు వేశాక ఎడమ చేతి వేలికి బదులు కుడి చేతి వేలికి సిరా గుర్తు వేశారు ఎన్నికల సిబ్బంది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి 28వ పోలింగ్‌ కేంద్రంలో తుమ్మల తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాధారణంగా ఓటు వేశాక ఎడమ చేతి వేలికి ఇంక్ మార్క్ వేస్తారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మాత్రమే  వేలు మార్చుటకు ఎన్నికల సంఘం ఆదేశాలిస్తుంది.