పదేండ్లలో పోస్టుల భర్తీ లేక ఇబ్బందులు పడ్డాం : సంఘం నేతలు

పదేండ్లలో పోస్టుల భర్తీ లేక ఇబ్బందులు పడ్డాం : సంఘం నేతలు

బషీర్ బాగ్, వెలుగు : మండల వ్యవసాయ అధికారుల పోస్టులను మంజూరు చేసినందుకు తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. బషీర్ బాగ్ లో శక్రవారం నిర్వహించిన సమావేశంలో సంఘం ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత బీఆర్ఎస్ పాలనలో పదేండ్లలో వ్యవసాయ శాఖలో కిందిస్థాయి పోస్టులు తప్ప జిల్లా, మండలస్థాయి అధికారుల పోస్టులు భర్తీ చేయలేదని సంఘం వ్యవస్థాపక  చైర్మన్ కృపాకర్ రెడ్డి, అధ్యక్షుడు వైద్యనాథ్ పేర్కొన్నారు.

పైస్థాయి అధికారులు లేకపోగా క్షేత్రస్థాయి అధికారులు ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కొత్తగా మంజూరైన పోస్టులు అధికారుల నియామకానికి ముందే, ఐదేండ్లు పైబడి ఒకే చోట పని చేసిన వ్యవసాయ అధికారులకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని కోరారు. జిల్లా, డివిజన్ స్థాయిలో కొత్త పోస్టులను మంజూరు చేసి వ్యవసాయ శాఖని రైతు సేవలో పటిష్ట పర్చాలని విజ్ఞప్తి చేశారు.