
హ్యాచ్‌బ్యాక్ మోడల్ టియాగో సేల్స్ ఐదు లక్షల మార్క్‌ను దాటిందని టాటా మోటార్స్ ప్రకటించింది. చివరి లక్ష బండ్ల సేల్స్‌ను గత 15 నెలల్లోనే అందుకున్నామని వెల్లడించింది. టియాగో మోడల్ పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. టియాగో ఎన్‌ఆర్‌జీ వేరియంట్‌ను ఎస్‌యూవీ మాదిరి డిజైన్ చేశారు.