దారుణం: చెట్టుకు కట్టేసి కొట్టి.. నోట్లో మూత్రం పోసి..

దారుణం: చెట్టుకు కట్టేసి కొట్టి.. నోట్లో మూత్రం పోసి..

ఒడిశాలోని ఖుర్ధా జిల్లాలో దారుణం జరిగింది. ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టి, తాగడానికి నీళ్లు అడిగితే నోట్లో మూత్రం పోసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఖుర్దా జిల్లాలోని బంగిడా గ్రామానికి చెందిన సౌమ్య రంజన్ దాస్‌ను పొరుగు గ్రామమైన కైపాదర్‌కు చెందిన రాజేంద్ర భూయాన్ మరియు గాటియా పాల్తాసింగ్‌లు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత దాస్‌ను ఓ కొబ్బరి చెట్టుకు కట్టేసి కర్రలతో తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు సొమ్మసిల్లిన దాస్.. వారిని తాగడానికి మంచినీళ్లు అడిగితే దాస్ నోట్లో మూత్రం పోశారు.

ఈ ఘటన డిసెంబర్ 18న జరిగిందని, ఈ దారుణానికి పాల్పడిన రాజేంద్ర భూయాన్ మరియు గాటియా పాల్తాసింగ్‌‌లతో పాటూ ఈ ఘటనతో సంబంధమున్న మరో వ్యక్తి భటపాడ సౌమ్య రంజన్ పైక్రేను అరెస్టు చేసినట్లు ఖుర్దా పోలీసు సూపరింటెండెంట్ అజయ్ ప్రతాప్ స్వైన్ తెలిపారు. పాత కక్షల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు.

దాస్ గ్రామానికి చెందిన ఓ యువతి, నిందితుల గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉంది. ఇది నచ్చని అమ్మాయి కుటుంబ సభ్యులు, ఆమెతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు. అలా కొట్టిన వారిలో దాస్ కూడా ఉన్నాడు. ఆ కక్షతోనే నిందితులు దాస్‌ను ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసు అధికారి తెలిపారు. దాస్‌పై దాడి జరుగుతున్న సమయంలో కైపాదర్ గ్రామానికి చెందిన చాలా మంది అదే స్థలంలో ఉన్నారు కానీ, ఎవరూ కూడా దాడిని ఆపడానికి ప్రయత్నించకపోవడం మరో దారుణం.

For More News..

జూలో బాలుడిపై దూకిన పులి.. వీడియో వైరల్