మూడు పిల్లలకు జన్మనిచ్చిన పులి

మూడు పిల్లలకు జన్మనిచ్చిన పులి

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ డివిజన్​లోని పెంచికల్ పేట రేంజ్​లో  కే–8 పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ విషయంపై నోరు మెదపడం లేదు. మహారాష్ట్రలోని తడోబా నుంచి మరో పెద్దపులి సైతం రెండు పిల్లలను వెంటపెట్టుకొని కాగజ్ నగర్ అడవులకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆసిఫాబాద్ డీఎఫ్ఓ శాంతారామ్ ను సంప్రదించగా కెమెరాలో క్యాప్చర్ అయి ఉండొచ్చని, పూర్తి సమాచారం రాలేదని చెప్పారు.