Baaghi 4: యాక్షన్-ప్యాక్డ్ వీడియోతో..టైగర్ ష్రాఫ్ భాగీ 4 అప్డేట్

Baaghi 4: యాక్షన్-ప్యాక్డ్ వీడియోతో..టైగర్ ష్రాఫ్ భాగీ 4 అప్డేట్

టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)..బాలీవుడ్ కు ఈ పేరు సుపరిచితమే..ఫిట్ నెస్ కు పెట్టింది పేరు టైగర్ ష్రాప్. భారీ కండలతో ,ఫిట్ నెస్ తో పాటు అదిరిపోయే డ్యాన్స్ లతో అందరి దృష్టిని ఆకర్షించాడు టైగర్ ష్రాఫ్.తక్కువ టైంలోనే చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. బాఘీ,బాఘీ 2,బాఘీ 3,స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, గణపత్, వార్ వంటి సినిమాలతో తనదైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వస్తున్నాడు. 

లేటెస్ట్గా టైగర్ ష్రాఫ్ నుండి ఇంటెస్టింగ్ అప్డేట్ వచ్చింది. భాఘీ ప్రాంచైజీ నుంచి `భాఘీ-4(Baaghi 4)` కూడా రాబోతున్న‌ట్లు మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇందులో కూడా టైగ‌ర్ ష్రాప్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా టైగ‌ర్ తన మ‌నసులో మాటలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నాడు. 'నా మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన‌..స‌వాల్ విసిరిన ప్రాంచైజీ ఇది. అత‌డు త‌న కుటుంబం కోసం పోరాడాడు. అలాగే ఒక దేశానికి వ్య‌తిరేకంగా పోరాటం చేసాడు. భాఘీ ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన అధ్యాయం రాబోతుంది` అంటూ టైగ‌ర్ పోస్ట్ చేశాడు. 

దీంతో భాఘీ 4 పై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా..హై ఆక్టేన్ యాక్ష‌న్ మించి తీసుకొస్తున్నట్లు వీడియో చూస్తే అర్ధమవుతోంది.భాఘీ మూడు భాగాల్ని నిర్మించిన సాజిద్ న‌డియావాలా య‌ధా విధిగా ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. అయితే డైరెక్టర్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. 

`భాఘీ` స‌క్సెస్ పుల్ ప్రాంచైజీ తెరకెక్కించిన డైరెక్టర్స్..ఒక్కో మెట్టు ఎక్కుతూ హిట్ చేసేస్తున్నారు. సబ్బీర్ ఖాన్ తెర‌పైకి తెచ్చిన ఈ ప్రాంచైజీ..అంతకంతకు అహ్మ‌ద్ ఖాన్ తెర‌కెక్కించి హైప్ తీసుకొచ్చాడు. మరి ఇదే డైరెక్టర్ తెరకెక్కిస్తాడా? లేక కొత్త డైరెక్టర్ వస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా 2025 లో రిలీజ్ కానుంది.