
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కలిసి నటించనున్న చిత్రం ‘టైగర్ వర్సెస్ పఠాన్’. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. స్పై యూనివర్స్‌లో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 చిత్రాలు నిర్మించిన యశ్ రాజ్ సంస్థ.. ‘టైగర్’ సిరీస్‌లోని సల్మాన్, ‘పఠాన్’లో షారుఖ్ క్యారెక్టర్స్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుండి షూటింగ్ ప్రారంభించి, 2025లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. దీంతో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేశాడట దర్శకుడు.
కానీ స్క్రిప్ట్ విషయంలో రీ వర్క్ చేయాలని, ఇంకాస్త బెటర్ కంటెంట్ కావాలంటూ సినిమాను వాయిదా వేశాడు నిర్మాత ఆదిత్య చోప్రా. దీంతో 2025లో షూట్ స్టార్ట్ చేసి, 2026లో రిలీజ్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘టైగర్ 3’ చిత్రం ఆశించిన స్థాయిని అందుకోకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
ఇప్పటివరకూ ఈ మూవీ ఐదు వందల కోట్ల వసూళ్లు దాటలేదు. టికెట్స్ రేట్లు తగ్గడం వల్లే కలెక్షన్స్ రాలేదని ఇటీవల సల్మాన్ చేసిన కామెంట్స్‌పై కూడా విమర్శలు వినిపి స్తున్నాయి. ఈ నేపథ్యంలో కంటెంట్‌పై ఇంకాస్త బెటర్‌మెంట్ చేయడం కోసమే ఇలా పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది.