మెదక్ టౌన్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్‌ను శుక్రవారం ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
